ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీసీరోడ్డు పనులకు పీఏసీ చైర్మన్ ,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:45 PM

చందానగర్ సర్కిల్ 21 హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మంజీర పైప్ లైన్ రోడ్డులో రూ. 4 కోట్ల 31 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే హఫీజ్పెట్ ఫ్లై ఓవర్ నుండి మై హోమ్ జ్యువెల్ వెనుక గేట్ వరకు సీసీ రోడ్డు , ఆర్టీసీ  కాలనీ నుండి జాతీయ రహదారి నుండి  మురళీధర్అసోసియేషన్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు  చందానగర్ డీసీ  మోహన్ రెడ్డి ,కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పీఏసీ ఛైర్మెన్, ఎమ్మెల్యే గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ..  సంక్షేమం , అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోకజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు, కాలనీవాసులు,  అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa