ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొల్లపల్లి లో ఘనంగా కాక వెంకటస్వామి జయంతి వేడుకలు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:48 PM

మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) 95వ జయంతి వేడుకలను జగిత్యాల జిల్లా గొల్లపల్లి మార్కెట్ యార్డ్ లో ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ ఆధ్వర్యంలో శనివారం రోజు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా భీమా సంతోష్ వెంకటస్వామి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం చైర్మన్ భీమా సంతోష్ మాట్లాడుతూ... తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమంలో వెంకటస్వామి  కీలక పాత్ర  పోషించారని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం వెంకటస్వామి ఎంతో కృషి చేసారాని గుర్తు చేశారు.
ఒక సామాన్య కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగి పేద ప్రజల కోసం,బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వెంకటస్వామి పాటుపడ్డారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి,పాలకవర్గ సభ్యులు కొక్కుల జలంధర్,నక్క రాజయ్య,చాడ సతయ్య,కట్ట లక్ష్మన్ రావు,మార్కెట్ కార్యదర్శి ఫైజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa