ట్రెండింగ్
Epaper    English    தமிழ்

*గుండెపోటుతో కాంగ్రెస్ నాయకుని మృతి*

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 09:45 PM

కరీంనగర్ జిల్లా మానకొండూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జడల రమేష్(44)గుండెపోటుతో హఠాత్మరణం చెందాడు.కరీంనగర్లోని అలకాపురి కాలనీలోని తన నివాసంలో మృతి చెందాడు.కాంగ్రెస్ లో బిసి నేతగా ఎదుగుతున్న సమయంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం బాధాకరం.
రమేష్ మరణ వార్త సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు రమేష్ ఇంటికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి,పూల మాల వేసి నివాళులర్పించారు.రమేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.రమేష్ మరణం పార్టీకి తీరని లోటన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa