ప్రభుత్వ జూనియర్ కళాశాల కోహెడ లో ఈరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంటర్ విద్యాధికారి కే రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక బతుకమ్మని ప్రకృతిలో లభించే తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. స్థానిక తహసిల్దార్ సురేఖ హాజరై సంబరాలను ప్రారంభించి బతుకమ్మ,దసరా పండుగలను ఆనందంగా జరుపుకోవాలని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని అన్నారు.
విద్యార్థులు ఆటపాటలతో ఆడుకుంటూ అందరూ ఆనందంగా సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వడ్డేపల్లి రాజమౌళి, అధ్యాపకులు శ్రీ కె యాదగిరి, రజిత,నీరజ, సుజాత, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, అశోక్, సీతారామయ్య, నరేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa