ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా దేవి నవరాత్రి వేడుకలు....

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:44 PM

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేటీఆర్ కాలనీ, సాయి బృందావన్ కాలనీ, బాచుపల్లి ప్రాంతాలలో ఏర్పాటుచేసిన దుర్గా నవరాత్రి వేడుకలలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలవడం ద్వారా చేపట్టిన ప్రతి కార్యంలో విజయం చేకూరుతుందన్నారు.
అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు కలిగించాలని వేడుకున్నారు. అనంతరం దేవాలయ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, బాలాజీ నాయక్, సీనియర్ నాయకులు సతీష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa