ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులె

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 07:07 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండ పార్టీ కార్యాలయంలో పల్లా పర్వత రెడ్డి భవన్ లో జరిగిన నియోజకవర్గ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ఆవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక  విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సామాన్య  ప్రజలు పండగలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూల విధానాల అవలంబిస్తుందని ఆరోపించారు .గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ,పెన్షన్ల పెంపు ,రైతు భరోసా ఇలాంటి హామీలు తక్షణమే అమలు చేయాలని కోరారు.
ఈ సమావేశానికి ఎస్ కనకాచారి అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ జిల్లా కౌన్సిల్ సభ్యులు యండి మైనుద్దీన్,తూమ్ బుచ్చిరెడ్డి, పోలే వెంకటయ్య. బొమ్మ అచ్చయ్య , ఉప్పునూతల వెంకటయ్య నూనె రామస్వామి, వలమల ఆంజనేయులు, కే జయరాములు, వై పాండురంగారెడ్డి, నూనె వెంకటేశ్వర్లు జూలూరు వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa