తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ మండలం భవానిపేట్ గ్రామానికి చెందిన గంగని రాములు (50) అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం బైక్ పై వెళ్తూ.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాములు తలకి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa