వైద్య విద్యను అభ్యసించాలనే కల ఒక్కో కుటుంబంలో ఒకరికే దక్కడం కష్టం. అలాంటిది ఒకే ఇంట్లో నలుగురు పిల్లలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం చాలా అరుదు. ఈ అరుదైన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది.
కొంక రామచంద్రం శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. నలుగురు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే హరీష్ రావు పిల్లలను గురువారం అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa