అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తాజాగా.. నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంటూ విచారణను అదే రోజుకు వాయిదా వేసింది.
కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంతల విడాకులకు కారణం కేటీఆరేనని ఆరోపించారు. కేటీఆర్ వల్లే ఎంతోమంది హీరోయిన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. నాగార్జున కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై ఆమె వ్యాఖ్యలను తప్పు బట్టింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి సమంత విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు.
అయితే కొండా సురేఖ వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన నాగార్జున ఆమెపు పరువు నష్టం దావా వేశారు. ఈనెల 8న కోర్టుకు హాజరైన నాగార్జున.. కొండా సురఖ తమ గౌరవానికి భంగం కలిగేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారని ధర్మాసనానికి తెలిపారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. సినీరంగంలో ఉన్నవారిపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. నేడు రెండో సాక్షి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన న్యాయస్థానం ఆమెకు నోటీసులు జారీ చేసింది.
ఇక మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ నేడు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం వెంటనే విచారణ ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa