హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ డీజిల్ ట్యాంకర్ పేలింది. నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డీజిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలిపోయింది. డ్రైవర్ లారీ నుంచి కిందకు దూకడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa