ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయన్ను విచారిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు ఇటీవల పోలీసులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి చరవాణులను పోలీసులు విశ్లేషించారు. నిందితుల చరవాణుల్లో కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నారు. జైపాల్ యాదవ్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa