మహబూబాబాద్ జిల్లా: వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్ పి ఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, మహబూబాబాద్ జిల్లా వికలాంగుల పోరాట సమితి (విహెచ్ పి ఎస్) సమావేశంలో అబ్బూరి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పాత కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తధానంతరం నూతన జిల్లా కమిటీ ని ఏర్పాటు చేశారు. వికలాంగుల జిల్లా కమిటీలో, వికలాంగుల హక్కుల పోరాట సమితి గూడూరు మండల నాయకులైన రుద్ర తిరుపతి, (వి హెచ్ పి ఎస్) స్థాపించినప్పటి నుండి నేటి వరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, మండలంలోనే స్థానికంగా ఉంటూ వికలాంగుల సమస్యలను జిల్లా నాయకులకు, పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, అమలు అయ్యే దిశగా పనిచేస్తున్నారు. వారి శ్రమను, కృషిని గుర్తించి మరల అవకాశం కల్పిస్తూ, మహబూబాబాద్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి.హెచ్.పి.ఎస్) జిల్లా కార్యదర్శిగా రెండవసారి రుద్ర తిరుపతిని నియమించినట్లు వారు తెలిపారు. ఈ పదవి నాకు రావడానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు ఎండి. పాషా, ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ గుగ్గిళ్ళ పీరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలగోల వెంకన్న గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బూరి వినోద్ కుమార్ రెడ్డి, ఎం ఆర్ పి ఎస్. నాయకులు రాష్ట్ర నాయకుడు పాశం సాంబయ్య, నాలం రమేష్, జిల్లా నాయకులు గుర్రం ప్రభాకర్, బుడిగె శ్రీరాములు మిత్రులందరికీ, వి హెచ్ పి ఎస్. జిల్లా కార్యదర్శి రుద్ర తిరుపతి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa