సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి సర్వేలో సేకరించిన డేటాను అత్యంత గోప్యంగా ఉంచాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆదేశించారు. సర్వేతో పాటు, సర్వే వివరాల నమోదు అత్యంత ముఖ్యమని అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదుకై నియమించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.