చందంపేట మండలం పెద్ద మూల గ్రామపంచాయతీలో మంగళవారం ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి గ్రామ సమస్యలు,భూ సమస్యలు, పెద్ద మూల రోడ్డు విషయంలో గ్రామ అభివృద్ధి విషయాలపై ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలోగ్రామానికి చెందిన గ్రామ పెద్దలు పేర్ల నాగేష్, సుందరయ్య ,బిక్షపతి భిక్షమయ్య, బండి వెంకట రాములు ,మేకల వెంకటయ్య ,సత్తెరసాల బిక్షపతి, నూనె బుచ్చమయ్య ,ముత్యాల కుమార్ ,చేపూరి వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.