హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైండ్ స్పేస్ భవనం( పైనుంచి దూకి నవీన్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు.ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుకుసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నవీన్ రెడ్డి ఎన్సీఆర్ ఓఎక్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు గుర్తించారు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని అమరావతిగా నిర్ధారించారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.