ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాచార హక్కు చట్టం 2005 సూచిక బోర్డులు అన్ని కార్యాలయాల్లో నియమించండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 21, 2024, 02:31 PM

వరంగల్ జిల్లా నర్సంపేట  నియోజకవర్గంలో నల్లబెల్లి  మండలం లో   సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలు మరియు గ్రామ పంచాయితీ కార్యాలయాలు లో సమాచార హక్కు చట్టం బోర్డు నియమించాలని  తాసిల్దార్  గారికి వినతి పత్రం అందజేత ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం-2005 నర్సంపేట  అధ్యక్షుడు విజేందర్ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ బద్దమైనటువంటి సమాచార హక్కు చట్టం - 2005 సెక్షన్ 5(1)(2) ప్రకారం మండలంలోని మరియు గ్రామ స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయల యందు సెక్షన్ 4 (4) ప్రకారం.
స్థానిక అధికార భాషలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయలని మరియు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డుల యందు గల అసంపూర్తి సమంచారాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని మరియు సమాచార హక్కు చట్టం - 2005 సెక్షన్ 4(1) (8) (ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన 17. అంశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచగలరని కోరుతున్నాము. సమాచార హక్కు చట్టం -2005 సెక్షన్ 26 ప్రకారం గ్రామస్థాయి వరకు సమాచార హక్కు చట్టంపై ప్రజలకు శాఖాంపరమైన అవగాహాన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో  నర్సంపేట యూత్  అధ్యక్షుడు అడ్డ సతీష్ ,పరకాల డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ళ అనిల్ గౌడ్   తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com