ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని కోదాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడలోని స్థానిక అన్నదాన సన్నిధానంలో సర్వ మాలధారుణలకు అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. అయ్యప్ప స్వాముల దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిత్య అన్నదానాలు నిర్వహిస్తున్న అన్నదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గాలి శ్రీనివాస్ నాయుడు, స్వాములు ఉన్నారు.