ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన గర్బిణి రవళి పురిటి నొప్పులు రావడంతో 108లో ఏటూరునాగారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ములుగు రెఫర్ చేయగా వైద్యులు పరీక్షించి హన్మకొండకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో హన్మకొండకు వెళ్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు అధికం కావడంతో 108 సిబ్బంది చాకచక్యంగా ప్రసవం చేశారు. పైలట్ శ్రీను, ఈఎంటి నాగరాజు ఉన్నారు.