పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం. ఓ వయస్సు వచ్చాక పెళ్లి గురించి చాలా మంది కలలు కంటుంటారు. తానకు కాబోయే భార్య ఇలా ఉండాలి.. కాబోయే భర్త అలా ఉండాలని యవతీ యవకులు ఊహల్లో తేలియాడుతుంటారు. అయితే ప్రస్తుత సమాజంలో రకరకాల కారణాల వల్ల పెళ్లికాని ప్రసాదులు ఎక్కువైపోయారు. కొందరు యువకులకు 30 ఏళ్లు దాటిన పెళ్లిళ్లు కావటం లేదు.
వయస్సు పైబడుతోంది. కానీ పెళ్లి ఘడియలు మాత్రం ఇంకా రావటం లేదు. ఎక్కడా సంబంధాలు కుదరక అబ్బాయిలు విసిగిపోతున్నారు. కొందరు మ్యారేజ్ బ్యూరోల బాట పడుతున్నారు. అయినా సరే.. పెళ్లి సంబంధాలు రాకపోటవంతో మనో వేధనకు గరువుతున్నారు. ఈ వేదనతో కొందరు యువకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో విలువైన ప్రాణాలను క్షణికావేశంలో తీసేసుకుంటున్నారు. ఆత్మహ్యతలు చేసుకుంటూ కన్నవారికి, కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు.
తాజాగా సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కావట్లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సంగు భాస్కర్ (36) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా అతడికి పెళ్లి సంబంధాలు చేస్తున్నారు. తెలిసిన వారు, మ్యారేజ్ బ్యూరోల ద్వారా పెళ్లి సంబంధాలు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కడా అమ్మాయి కుదరలేదు.
దీంతో గత కొన్ని రోజులుగా భాస్కర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 8) రాత్రి డ్రైవింగ్‌కు వెళ్లి వచ్చిన భాస్కర్.. అదే రోజు ఇంట్లోని తన గదిలో ఉరేసుకున్నాడు. ఉదయం కుమారుడి గది తలుపులు తెరిచి చూసిన తండ్రి.. ఫ్యానుకు వేలాడుతుండటం చూసి షాక్‌కు గురయ్యాడు. ఇరుగు పొరుగు వారి సాయంతో కిందకు దించి చూడగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి కావట్లేదని మనస్తాపంలో తన కుమారుడు సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి అంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లికాకపోతే మాత్రం ఇలాంటి పని చేస్తారా..? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.