రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా మెరుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా రంగు సురేష్ గౌడ్ ను ఎన్నుకున్నట్లు గౌడ సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామ శాఖ గౌడ సంఘ ఎన్నికలకు సహకరించిన గ్రామ గౌడ కుల బాంధవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.