జగిత్యాల జిల్లా బుగ్గారం మండలానికి మంజూరు అయిన 108 అంబులెన్సును మంగళవారం బుగ్గారం మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మండల ప్రజల సౌకర్యార్థం అంబులెన్సు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.