మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అభిమాని, సీనియర్ నాయకుడు జిన్న గణేష్ ముదిరాజ్ ఆనరోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలిసి, మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గం సాయి నగర్ లోని గణేష్ ముదిరాజ్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. గణేష్ ముదిరాజ్ కి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, వెంకటేష్ యాదవ్, బికే శ్రీను, ఎస్సార్ ప్రసాద్, రవికుమార్ పాల్గొన్నారు.