బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పండుగ సాయన్న చిత్రపటానికి ఘనంగా పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్న సేవలు మరువలేనిది, దొరల దగ్గర దోచుకుని పేదల కడుపులు నింపిన పండుగ సాయన్న వీర చరిత్ర మరువలేనిది, ఆయన కలలు కన్న బహుజన రాజ్యం కోసం తామంతా పోరాడుతామన్నారు.