ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యాథ్స్ ట్యాలెంట్ టెస్టులో ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 03:39 PM

చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి మ్యాథ్స్ ట్యాలెంట్ టెస్ట్ - 2024 పరీక్షలో మండల పరిధిలోని అంతారం గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు నిఖిత, గౌతమ్ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
డిసెంబర్ 11న నిర్వహించే జిల్లా స్థాయి పరీక్షలో నిఖిత, గౌతమ్ పాల్గొనన్నురని తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో నిర్వహించే పరీక్షకు ఎంపికైన విద్యార్థులు నిఖిత, గౌతమ్ లను ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు హనీ, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa