లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఎస్సై రేవతి అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని పలు చౌరస్తాల్లో వాహనాల తనిఖీలు చేశారు. వాహనలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.
సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేయరాదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు.