చెంచుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. కొల్లాపూర్ మండల పరిధిలో అమరగిరి గ్రామ చెంచు పేటలను తెలంగాణ గిరిజన సంఘం ఆదివారం సందర్శిచారు.
కృష్ణానది తీరాన ఆనుకొని ఉన్న అమరగిరి చెంచు వాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులు స్పందించి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.