మీ లక్ష్యం వైపు మీ దృష్టి ఉండాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవిఎస్ కళాశాలలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ను సందర్శించి, హాస్టల్ పరిసర ప్రాంతాలతో పాటుగా హాస్టల్ గదులను, కిచెన్ ను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ. నీళ్ళు, నిధులు, నియామకాలు, కొరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ఉద్యోగాలు వదిలి ఉద్యమం చేసి తెచ్చుకున్నామని అన్నారు.