మల్లేపల్లి మండలం కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి రామలింగం(28) ఆదివారం బైక్ పై నాంపల్లి వెళ్లి వస్తుండగా, కేతేపల్లి గ్రామ శివారులోకి రాగానే మల్లేపల్లి నుండి వస్తున్న ట్రాక్టర్ బైక్ ను ఢీ కొట్టడంతో రామలింగం అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండ ఎస్సై మృతదేహాన్ని దేవరకొండకు తీసుకెళ్తుండగా విషయం కుటుంబసభ్యులకు తెలిసి వారిని అడ్డుకున్నారు.