తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబందించిన 80 లక్షల మంది దరఖాస్తుదారుల డేటా జనవరి 4 లేదా 5 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఇండ్ల నిర్మాణానికి అర్హులకు కేంద్రం నిధులు రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని అందిస్తుందని చెప్పారు. మంగళవారం 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేడర్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు.