సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణం శ్రీనగర్ కాలనీ మౌంట్ కల్వరి చర్చిలో బుధవారం ఉదయం క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేకును కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకులు మాదిరి పృధ్విరాజ్ పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి నిర్వాహకులు, స్థానిక నాయకులు, స్థానికులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.