సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పీసీసీ సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ హాజరై పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.