మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జన్మదిన వేడుకలు బుధవారం ఐఎస్ సదన్ డివిజన్లోని శివాజీ చౌక్ నాగార్జున కాలనీ కమాన్ వద్ద నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.