కాగజ్‌నగర్ పట్టణంలోని బీజేపి కార్యాలయంలో భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ తో కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.