భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 31 నుంచి జనవరి 10 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు ఈవో రమాదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో నిత్య కళ్యాణాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. జనవరి 11 నుంచి భద్రాద్రిలో నిత్య కళ్యాణాలు పునః ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఈవో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa