పటాన్చెరు : పటాన్చెరు మండలం పోచారం గ్రామ పరిధిలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని నిర్ణయం జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పోచారం మాజీ సర్పంచ్ జగన్, మాజీ ఎంపిటిసి బిక్షపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa