యాదగిరిగుట్టపై (Yadagirigutta) ఓ బాలునికి ప్రమాదం తప్పింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూస్తుండగా బాలుని తల గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. గమనించిన తోటి భక్తులు బాలున్ని రక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన ఓ కుటుంబం ఆదివారం ఉదయం స్వామి వారి దర్శనం కోసం రూ.150 టికెట్ ప్రవేశ క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో దయాకర్ అనే బాలుడి తల గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన తోటి భక్తులు బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీశారు. బాలుడికి ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa