నేరడుగొమ్ము మండలం గుర్రపుతండా గ్రామంలో లయన్స్ క్లబ్ అఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో షారోన్, ఆరోన్ జాయ్ నాయక్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. అలెతియా బంజారా స్కూల్ ఆవరణలో ఉ. 9 నుంచి మ. 2 గంటల వరకు యశోద ఆసుపత్రి ప్రముఖ వైద్యులతో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.