మేడిపల్లి మండల కేంద్రంలో సుమారు 34 లక్షల 50 వేల రూపాయల అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి పనులు వేగంగా దూసుకుపోతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి, సీనియర్ నాయకులు మార్గం నర్సరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa