హైదరాబాద్ లోని డా. బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ లో గురువారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యకలాపాల ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నారాయణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa