ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 04:04 PM

నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో నేడు జరనుగంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య వేడుక జరగనున్న నేపథ్యంలో యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.


ట్రాఫిక్ ఆంక్షలు…
- జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వచ్చే వాహనాలను కృష్ణానగర్ వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలను శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మీదుగా మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ వద్ద మళ్లించనున్నారు.
- మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్టాప్ వైపు వెళ్లే వాహనాలను కృష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, కల్యాణ్ నగర్, మోతీ నగర్ మీదుగా బోరబండ బస్టాప్ వైపు అనుమతించనున్నారు.
- అదే విధంగా బోరబండ నుంచి మైత్రివనం జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేశ్ చంద్ర విగ్రహం మీదుగా మళ్లించనున్నారు.
- ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారు తమ వాహనాలను జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్ హాల్, మహ్మద్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa