కొండమల్లేపల్లి: మందకృష్ణ మాదిగ తలపెట్టిన వేల గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఎదుల ఎల్లయ్య పిలుపునిచ్చారు. బుధవారం చింతకుంట్లలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నికకు ఆయన హాజరై మాట్లాడారు. నూతన అధ్యక్షులుగా వి. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎ. శ్రీను, ప్రధాన కార్యదర్శిగా ఎమ్. శ్రీను, సహాయ కార్యదర్శిగా ఎన్. ఆదాము, కోశాధికారిగా ఇ. నగేష్, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
![]() |
![]() |