ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులపై దృష్టి సారించారు. గురువారం నిబంధనలు ఉల్లంఘించిన 16 బస్సులపై కేసులు నమోదు చేశారు.