దృష్టి మళ్లించి ఏటీఎం కార్డ్స్ కొట్టేసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసామని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహర తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లడుతూ.బహుదూర్ పురాలో డిసెంబర్ 22వ తేదీన ఒక మహిళ ఏటీఎంలో డబ్బులు తీస్తుండగా ఆమె దృష్టి మళ్లించి నకిలీ ఏటీఎం కార్డు ఇచ్చి ఒరిజినల్ కార్డ్ తీసుకెళ్లి 2 లక్షలు విత్ డ్రా చేశారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు పట్టుబడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa