ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 02:46 PM

జగదేవపూర్ మండలంలో తిగుల్ నర్సాపూర్, కొండపోచమ్మ ఆలయం వద్ద సోమవారం రాత్రి కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల గురించి, మూఢనమ్మకాల గురించి, సామాజిక రుగ్మతల గురించి, సోషల్ మీడియా దాని ప్రభావం గురించి,మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని,  చైన్ స్నాచింగ్, పిక్ ప్యాకెటింగ్ జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మవద్దు జాతరలో దొంగలు ఉంటారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.  సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త జాతరకు వచ్చిపోయే భక్తులు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏదైనా సైబర్ నేరం జరిగితే గంటలోపు సైబర్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్రామంలో పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలలో ఎవరైనా గంజాయి అక్రమంగా కలిగి ఉన్నా, ఇతరులకు అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే  డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100   సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యం ఉంచుతామని మరియు నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మంత్రాలు తంత్రాలు మూఢనమ్మకాలు,రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, మంత్రాలు తంత్రాలు మూఢనమ్మకాలు  సామాజిక రుక్మతల గురించి  సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శ్యాంసుందర్, కనకయ్య, హరిప్రసాద్, ప్రకాష్, బిక్షపతి, నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రదేశాల నుండి వచ్చిన భక్తులు గ్రామ ప్రజలు యువతి యువకులు పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa