ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2025, 04:29 PM

ప్రస్తుత కాలంలో బర్డ్ ఫ్లూ భయంతో జనాలు వణికిపోతుంటే.. కొందరు చికెన్ సెంటర్ యజమానులు డబ్బులకు ఆశపడి కుళ్లిన చికెన్ అమ్ముతున్నారు. ఈ ఘటన తాజాగా సికింద్రాబాద్ సమీపంలో జరిగింది. కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్‌లో పోలీసులు, కంటోన్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. దీనిలో భాగంగా సుమారు 2 క్వింటాళ్ల కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. వెంటనే ఆ చికెన్‌ను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa