తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. బుధవారం ఉదయం 7:55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16,058 మెగావాట్లుగా నమోదైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇదే అత్యధిక డిమాండ్ కావడం గమనార్హం. ఈనెల 10వ తేదీన 15,998 మెగావాట్ల డిమాండ్ నెలకొనగా... 9 రోజుల్లోనే ఆ రికార్డు చెరిగిపోయింది. డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ను అందించాలని, సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని సీఎండీలను భట్టి విక్రమార్క ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa