మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలోని స్వయంభూ శ్రీ భక్త మార్కండేయ దేవాలయాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి, జి పి. శ్రీకాంత్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ శ్యామ్ సుందర్, దేవాలయ చైర్మన్, స్థానిక నాయకులు, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa