కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు MLC ముఖ్యం కాదని ఎమ్మెల్యేగా ప్రజలు ఓడించినా తనకు లాభమే చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ తనకు ఇచ్చే ప్రాధాన్యతతో తృప్తిగా ఉన్నానని, MLC కావాలని అడగలేదు.. అడగబోనని అన్నారు. తనకు బదులుగా కమ్మ సామాజిక వర్గానికి ముపై ఏండ్లుగా ఎలాంటి పదవి లేదని, సంగారెడ్డిలో (Sangareddy) నా ఓటమి నా భార్య నిర్మలకు చైర్మన్ అయ్యే వెసులుబాటు వచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్ ౩౦ ఏళ్లుగా ఎలాంటి పదవీ లేకుండా ఉన్నాడని ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ దృష్టికి తీసుకువెళ్లానని, మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాన్నారు. కమ్మ సామాజిక వర్గం సెటిలర్స్ కు అవకాశం ఇస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో కలిసి రావొచ్చన్నారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఉత్తమ్ నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రేవంత్ సీఎం అయ్యాడు.. పొన్నం మంత్రి అయ్యాడు.. ఈ సారి ఎమ్మెల్సీగా జెట్టికి ఇవ్వాలని జగ్గారెడ్డి సూచించడం ఆసక్తిగా మారింది. హైదరాబాద్ లో యాక్టివ్ పాలిటిక్స్ ఉండాలంటే జెట్టి కుసుమ కుమార్ కు అవకాశం ఇవ్వాలన్నారు. కులం ప్రాతిపదికన కాకుండా.. పార్టీకి సేవలు అందించిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa