ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా మహిళా ఉద్యోగి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 09:17 PM

హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని సీజీవో టవర్స్ ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆమె బలవన్మరణం చెందారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది గాంధీ నగర్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa