మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిప్ప బూత్ అధ్యక్షులు ఉల్లంగ సాగర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సాగర్ మాట్లాడుతూ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోపాల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శశాంక్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa